Current Affairs Telugu Daily

వృద్ధుల కొనుగోలు శక్తిలో పెరుగుదల 
ఆర్ధిక స్థితిగతులు బాగుపడటం వల్ల మన దేశంలో వృద్ధులు చక్కని కొనుగోలు శక్తి ఉన్న వినియోగదారులుగా ఎదుగుతున్నారని ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. దేశవ్యాప్తంగా 10 వేల మందిని అధ్యయనం నిమిత్తం ఎంచుకున్నారు. వారందరినీ ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏజ్‌వెల్‌ కార్యకర్తలు ప్రశ్నించి వివరాలను నమోదు చేసుకున్నారు.
  • వయోవృద్ధుల్లో అయిదింట ఒకవంతు మందికి వారు చేసిన ఉద్యోగాలే ప్రధాన ఆదాయ వనరుగా మిగిలింది. తమ నెలసరి పింఛనే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు 60.4 శాతం మంది వెల్లడించారు. 
  • భూములు, ఇంటి అద్దే, గతంలో పెట్టిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ వంటివి తమ నెలసరి ఆదాయంగా ఉన్నట్లు 19.4 శాతం మంది చెప్పారు. వీరికి ఒనగూడుతున్న ఆదాయంలో 65.5 శాతం భూ సంబంధిత ఆస్తుల నుంచి, 74.5 శాతం ఇళ్ల అద్దె రూపంలో, పొదుపు ద్వారా 41.42శాతం లభిస్తోంది.
  • వయోవృద్ధుల్లో 32శాతం మందికి నెలకు రూ.20వేల దాకా వస్తోంది. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు అధ్యయనంలో 27శాతం మంది చెప్పారు.

views: 864

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams