Current Affairs Telugu Daily

సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు మృతి
సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు(99) 2018 ఏప్రిల్‌ 22న విజయవాడలో మృతి చెందారు. 1941లో చెన్నై ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంచాలకుడిగా 1978లో పదవీ విరమణ చేశారు.
  • సంగీత ప్రియులంతా ‘రజనీ’గా పిలుచుకునే రజనీకాంతరావు అనితరసాధ్యమైన ప్రతిభతో కర్ణాటక సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన బాణీని సృష్టించుకున్నారు. నాది ‘రజనీబాణీ’ అంటూ స్వయంగా చెప్పుకునేవారు.
  • విజయవాడ ఆకాశవాణి అంటే రజనీగా, రజనీ అంటే ఆకాశవాణి అన్నంతగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో తన అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆ కేంద్రం నుంచి భక్తిరంజని, సంస్కృత పాఠాలు, ఉషశ్రీ ధర్మసందేహాలు, ఈ మాసపుపాట, పిల్లల కార్యక్రమాలు వంటివి ఎన్నో ఆయన ప్రారంభించారు. ఇవన్నీ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందాయి.
  • వేటూరి సుందరరామ్మూర్తి ప్రసిద్ధ రచన ‘సిరికాకొలను చిన్నది’ రూపకాన్ని విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేశారు.
  • ‘జేజిమావయ్య’ పేరుతో బాలల కోసం ఎన్నో రచనలు చేశారు.
  • దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆకాశవాణిలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగం తొలిగా ప్రసారమైంది. ఆ తర్వాత రెండో కార్యక్రమంగా రజనీ రచించి, స్వరపరచిన ‘మాదీ స్వతంత్రదేశం’ దేశభక్తి గీతం ప్రసారమైంది.
  • రజనీకాంతరావు రూపొందించిన ‘కొండ నుంచి కడలి దాకా’ రూపకానికి జపాన్‌ ప్రభుత్వం నుంచి ‘నిప్పాన్‌ హోసో క్యొకాయ్‌’ బహుమతి లభించింది.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ (1981), కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం(1961), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’ (2007) పురస్కారాలు అందుకున్నారు. 
  • జంట కవులుగా ప్రసిద్ధి పొందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు దంపతులకు రజనీకాంతరావు 1920, జనవరి 29 తేదీన తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం పశ్చిమగోదావరిలో ఉన్న) నిడదవోలులో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీవేత్తలు కావడంతో చిన్ననాటి నుంచే రజనీలో సాహిత్యం పట్ల ఆసక్తి, అభినివేశం కనిపించేవి. 

views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams