Current Affairs Telugu Daily

117 ఏళ్ల జపాన్‌ వృద్ధురాలు నబి తజిమా మృతి 
జపాన్‌కు చెందిన 117 సం॥ల వృద్ధురాలు నబి తజిమా 2018 ఏప్రిల్‌ 21న మృతి చెందింది. నబి తజిమా 1900 ఆగస్టు 4న కగోషిమా ప్రాంతంలోని కికాయ్‌ ద్వీపంలో జన్మించింది.
  • 2017 సెప్టెంబరులో జమైకాకు చెందిన వయొలెట్‌ బ్రౌన్‌ 117 ఏళ్ల వయస్సులోనే చనిపోయింది. వీరిద్దరిలో ఎవరు అత్యంత వృద్ధురాలు అనే విషయమై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సువారు పరిశీలిస్తున్నారు.
  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన మజజొ నొనాకా(112) కూడా జపాన్‌ జాతీయుడే.
  • దేశంలో వందేళ్లు పైబడిన స్త్రీ-పురుషులు 68 వేల మంది వరకు ఉన్నారని జపాన్‌ ప్రభుత్వం 2017లో ప్రకటించింది.

views: 775

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams