Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్టు కేంద్రాలు
ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్టు లోగోను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్‌ 21న అమరావతిలో ఆవిష్కరించారు. ట్రస్టు బోర్డు తొలి సమావేశం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగింది.
  • క్యాన్సర్‌ వైద్యాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరువ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్టును అందుబాటులోకి తెచ్చింది.
  • ప్రస్తుతం చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలో మాత్రమే క్యాన్సర్‌ చికిత్స అందుబాటులో ఉంది.
  • ట్రస్టు ద్వారా మిగిలిన జిల్లాలతోపాటు బాధితులు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ దశలవారీగా కేంద్రాలు నెలకొల్పుతారు.
  • ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఆధ్వర్యంలోనే కేంద్రాలు, మొబైల్‌ యూనిట్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తారు. దీనికి కేంద్రం రూ.126 కోట్లు ఆర్థిక సాయం అందిస్తుండగా, టాటా ట్రస్టు రూ.200 కోట్లు సమకూరుస్తోంది. భాగస్వామల సహకారం కూడా తీసుకోనున్నారు. 

views: 811

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams