Current Affairs Telugu Daily

‘తెలంగాణ భూగర్భ జల వనరుల పరిరక్షణ, నిర్వహణ పైలెట్‌ ప్రాజెక్టు’ నివేదిక
నాగార్జునసాగర్‌ ఆధునికీకరణలో భాగంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా మర్రిగూడ, చందూర్‌ మండలాల్లోని 14 పంచాయతీల్లో భూగర్భ జవనరుల వృద్ధికి అమలు చేసిన ‘తెలంగాణ భూగర్భ జల వనరుల పరిరక్షణ, నిర్వహణ పైలెట్‌ ప్రాజెక్టు’ ఫలితాల నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు 2018 ఏప్రిల్‌ 20న విడుదల  చేశారు. 
ప్రాజెక్టు వివరాలు
  • నల్గొండ జిల్లా మర్రిగూడ, చందూర్‌ మండలాల్లో 98 శాతం భూగర్భ జలాలను వినియోగించుకోవడంతో భూగర్భం ఖాళీ అయింది.
  • ఆయా ప్రాంతాల్లో జల పునరుజ్జీవ విధానం(వాటర్‌ రీఛార్జి షాఫ్ట్‌ సిస్టమ్‌) అమలు చేసి తిరిగి జలమట్టంలో వృద్ధి సాధించారు.
  • ఇందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో 2011 నుంచి 2017 వరకు రూ.7.66 కోట్లతో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేశారు.
  • మొదట భూగర్భంలో నీరు నిక్షిప్తమై ఉండే ప్రాంతాలను గుర్తించి దానికి తగిన విధంగా, ఆయా గ్రామాల్లో 23 చెక్‌ డ్యాం లు పునరుజ్జీవ తొట్టెలు(వాటర్‌ రీఛార్జ్‌ షాఫ్ట్‌) నిర్మించారు. వాటి నిర్మాణ వ్యయంలో 15 శాతాన్ని జల వినియోగదారుల నుంచి సమకూర్చారు.
  • భూగర్భ జల వినియోగదారులతో గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు.
  • రైతులను నీటిని అధికంగా వినియోగించే పంటల నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించారు.
  • ఆయా చర్యల కారణంగా భూగర్భ జల వినియోగం 2011-12లో 93 శాతం ఉండగా..2015-16 సంవత్సరంలో 83 శాతానికి తగ్గినట్లు, భూగర్భంలో జలమట్టం పెరిగినట్లు తేల్చారు.

views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams