Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు జారీ అయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని 6 విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును 2018 ఏప్రిల్‌ 20న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి అందజేశాయి. అత్యున్నత పదవిలో ఉంటూ సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించాయి. ఐదు రకాల ‘దుష్ప్రవర్తన’ ఆధారంగా ఈ చర్యకు దిగినట్లు పేర్కొన్నాయి.
  • సీజేఐ అభిశంసనకు గురికావడం ఇంతవరకూ భారతదేశంలో చోటుచేసుకోలేదు.
  • సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జడ్జి బి.హెచ్‌.లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
  • అభిశంసన నోటీసుపై కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ముస్లింలీగ్‌ సభ్యులు సంతకాలు చేశారు.
  • మొత్తం 71 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినప్పటికీ వారిలో ఏడుగురు ఇటీవల పదవీ విరమణ పొందారు. దీంతో 64 మంది మాత్రమే సంతకం పెట్టినట్లయింది.
సీజేఐపై ప్రధాన అభియోగాలు
  1. ఒడిశాలోని ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసులో లంచాలు పుచ్చుకోవడం
  2. ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు సుప్రీం కోర్టు ముందుకొచ్చినప్పుడు ఒకవైపు పరిపానాధికారాలు, మరోవైపు న్యాయపరమైన అధికారాలను ప్రయోగించడం. 
  3. ఈ కేసు లిస్టింగ్‌ అంశంపై జస్టిస్‌ చలమేశ్వర్‌ ధర్మాసనం విచారణ మొదలుపెట్టినప్పుడు పాత తేదీలతో కూడిన నోట్‌ను రిజిస్ట్రీ ద్వారా న్యాయమూర్తుల ముందుంచడం. 
  4. తన భూములకు సంబంధించి తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయడం. 
  5. సున్నితమైన కేసుల్లో ఫలితాలను ప్రభావితం చేయడానికి కొన్ని నిర్దిష్ట ధర్మాసనాలకు మాత్రమే వాటి విచారణ బాధ్యతలను అప్పగించడం.

views: 1014

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams