బోదకాలు బాధితులకు నెలకు రూ.1000 పింఛను
బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారికి పింఛను పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో 2018 మే నెల నుంచి పింఛన్లు అందనున్నాయి. వీరికి ప్రతీనెలా రూ.1000 చొప్పున సాయం అందనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీచేసింది. 
  • బోదకాలు వ్యాధిగ్రస్థులను ప్రధానంగా మూడు దశలుగా గుర్తిస్తారు. ఈ వ్యాధి రెండు, మూడు దశల్లో కాలు ఉబ్బిపోతుంది. బొడిపెలు, పెద్దపెద్ద పులిపిర్లు ఏర్పడతాయి. బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు. సాధారణ జీవనశైలికి ఇది తీవ్ర ఆటంకంగా మారుతుంది. కనీసం కూర్చోడానికి కూడా వీలుకాని పరిస్థితి నెలకొంటుంది. ఈ రెండు దశల్లో ఉన్నవారికి పింఛను అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
  • రాష్ట్రంలో 65,944 మంది బాధితులు ఉండగా.. వారిలో రెండు, మూడు దశల్లోనివారు వారు 44,653 మంది ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. 
  • వీరందరికీ ‘ఆసరా’ పింఛను పథకం మాదిరే బ్యాంకు, పోస్టాఫీసుల ద్వారా పింఛను అందించేలా ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
  • ఈ జాబితాలో పేరు నమోదుకానివారు జిల్లా వైద్యాధికారితో ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఆ పత్రాన్ని జిల్లా వైద్యాధికారే కలెక్టర్‌కు పంపించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త అభ్యర్థులు నమోదైన ప్రతిసారి ఆ వివరాలను కలెక్టరుకు పంపిస్తుంటారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని తెలిపింది.

views: 680

Current Affairs Telugu
e-Magazine
May-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
BuyCurrent affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams