Current Affairs Telugu Daily

ఆటో డ్రైవర్లకు కమర్షియల్‌ లైసెన్సులు అవసరం లేదు 
టాక్సీలు, ఆటోలు, తేలికపాటి వాహనాలు(LMV) నడిపేందుకు విడిగా కమర్షియల్‌ లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2017 జులైలో సుప్రీంకోర్టు ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందిగా కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది.
  • ఇంతవరకు వ్యక్తిగతంగా డ్రైవింగ్‌ లైసెన్సు పొందిన తర్వాత వాణిజ్య లైసెన్సులనూ తీసుకోవాల్సి వస్తోంది.
  • కొత్త నిబంధనల ప్రకారం ఆటో, టాక్సీ చోదకులతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఇ-రిక్షా నడిపేవారు, ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆహారాన్ని అందించేవారు ప్రత్యేకంగా వాణిజ్య లైసెన్సులు పొందాల్సిన అవసరం లేదు.
  • ఏడున్నర టన్నుల లోపు బరువైన వాహనాలను నడిపేవారికి ఇది వర్తిస్తుంది. వారికిఉండే వ్యక్తిగత అనుమతి పత్రాలనే దీనికీ అనుమతిస్తారు.
  • విడిగా బ్యాడ్జిలు ఇచ్చే పద్ధతిని ఎత్తివేయాలని పేర్కొంది. ట్రక్కు, బస్సు, ఇతర మధ్యతరహా/ భారీ స్థాయి ప్రయాణికుల వాహనాలు నడిపేవారు మాత్రం ఎప్పటి మాదిరిగానే వాణిజ్య అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • టాక్సీలు, ఆటోలు నడిపేందుకు వాణిజ్య లైసెన్సు అవసరం లేనందున ఆ రంగంలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. అవినీతికి కూడా పెద్దఎత్తున గండి పడుతుందని చెప్పారు. 
LMV-  Light Motor Vehicle

views: 820

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams