Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ యువకుడికి యుధ్‌వీర్‌ పురస్కారం 
ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ స్మారక పురస్కారం 2018 ఈ ఏడాది హైదరాబాద్‌ యువకుడు సయ్యద్‌ ఉస్మాన్‌ అజహర్‌ మక్సూసీని వరించింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఉచిత అన్నదానం ద్వారా ఎంతో మంది పేద కడుపు నింపుతున్న మక్సూసీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర లూథర్‌, హిందీ మిలాప్‌ దినపత్రిక ప్రధాన సంపాదకులు, సంస్థ కార్యదర్శి వినయ్‌ వీర్‌ తెలిపారు.
  • ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు దివంగత యుధ్‌వీర్‌ జ్ఞాపకార్థం నెలకొల్పిన ఈ పురస్కారాన్ని 1992 నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు అందజేస్తున్నారు.

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams