Current Affairs Telugu Daily

క్యూబా అధ్యక్షుడిగా డియాజ్‌ కైనల్‌ 
క్యూబా నూతన అధ్యక్షుడిగా మిగెల్‌ డియాజ్‌ కైనల్‌ ఎన్నికయ్యారు. ఆరు దశాబ్దాల కాలంలో క్యాస్ట్రో కుటుంబేతరుడు అధ్యక్షుడు కావడం ఇదే ప్రథమం. 1959 విప్లవం తర్వాత జన్మించిన వ్యక్తి ఈ పీఠాన్ని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి.
  • విప్లవంతో అధికారాన్ని దక్కించుకున్న ఫిడెల్‌ క్యాస్ట్రో అనారోగ్యానికి గురికావడంతో ఆయన సోదరుడు రౌల్‌ 2006లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
  • 86 ఏళ్ల రౌల్‌ తన వారసుడిగా కైనల్‌ను 2018 ఏప్రిల్‌ 18న ఎంపిక చేశారు. జాతీయ అసెంబ్లీలో దీనిపై లాంఛనప్రాయంగా ఓటింగ్‌ జరిగింది.
  • 1961లో ‘బే ఆఫ్‌ పిగ్స్‌’ ఆక్రమణ వార్షికోత్సవం రోజునే ఓటింగ్‌ జరిగింది.

views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams