Current Affairs Telugu Daily

స్తంభించిన సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌
సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ 2018 ఏప్రిల్‌ 18న స్తంభించింది. ‘‘సైట్‌ అండర్‌ మెయింటెనెన్స్‌’’ అనే సందేశాన్ని వెబ్‌సైట్‌ రెండు గంటలపాటు చూపింది. బ్రెజిల్‌ హ్యాకర్లు వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
  • supremecourtofindia.nic.in అనే వెబ్‌సైట్‌లో కొన్ని గంటపాటు ‘‘హ్యాకిడో పోర్‌ హైటెక్‌ బ్రెజిల్‌ హ్యాక్‌ టీమ్‌’’ అనే అక్షరాలు కనిపించాయి.
  • జడ్జి లోయా మృతి కేసులో విచారణ జరుగుతున్నప్పుడే ఈ ఘటన చోటుచేసుకుంది.
  • బీజేపీ జమ్ముకశ్మీర్‌ యూనిట్‌ వెబ్‌సైట్‌ కూడా ఏప్రిల్‌ 18న కొన్ని గంటలపాటు హ్యాక్‌ అయింది. జనవరిలో కఠువాలో హత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలికకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ హ్యాకర్లు పోస్టు చేశారు. కొన్ని గంటల తరువాత వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams