Current Affairs Telugu Daily

‘మేలుకొలుపు’ పుస్తకావిష్కరణ 
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం రాసిన మేలుకొలుపు పుస్తకావిష్కరణ కార్యక్రమం 2018 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ్‌ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానం అనే నమ్మకం నేడు సడలిందన్నారు.
  • పుస్తకం రాయడానికి గల కారణాలను రచయిత అజేయ కల్లం  వివరించారు. తమది స్వాతంత్య్రం రాగానే పుట్టిన తరం అని, నిస్వార్థ రాజకీయ వాతావరణం, హరిత విప్లవం, విస్తరిస్తున్న విద్యాసంస్థలు, ఆధునిక దేవాలయాలుగా నిర్మితమౌతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఉత్సాహంగా పనిచేస్తున్న స్థానిక సంస్థలను చూస్తూ ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించామన్నారు. కానీ తమ ఆశలు నిరాశలు చేస్తూ కొత్త తరం రాజకీయ నాయకులు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజలను మేలుకొలపాన్న ఆశే పుస్తకాన్ని రాసేందుకు తనను ఉసికొల్పిందన్నారు. 
  • ‘రాజకీయ నాయకుల హామీలు, ప్రకటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అంటూ లెనిన్‌ చెప్పిన మాటతో ‘మేలుకొలుపు’ పుస్తక రచన మొదలైంది.
  • సాధారణ జీవితం గడుతున్న అగ్రరాజ్యాల నేతలను, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న ఇక్కడి నేతలతో పోల్చడం ద్వారా లోపాలను ఎత్తిచూపారు. ‘బెంగళూరు రైల్వే స్టేషన్లోని ప్లాట్‌ఫాం మీదకు మాజీ ప్రధాని కారు ఎలా వెళ్లిందో ప్రశ్నించి..ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు తన కారుకు తానే పెట్రోలు నింపుతూ ఉన్న ఫొటోను ప్రచురించడం’ ద్వారా మన దేశంలో రాజకీయ దర్పాన్ని నిలదీశారు.
  • 69 పేజీల మేలుకొలుపు ఇంగ్లీష్‌ పుస్తకాన్ని 53 పేజీలలో తెలుగీకరించి అందుబాటులోకి తెచ్చారు. ఇందులో మొత్తం 12 అంశాలను ప్రస్తావించారు.
  • గత ఐదు దశాబ్దాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా క్షీణించిందన్నారు.
  • స్థానిక సంస్థల అనుభవాలు లేని నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, విద్యాలయాలలో గ్రూపు రాజకీయాలు నడిపిన శక్తులు రాజకీయ రంగ ప్రవేశం చేసి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు.
  • విశృంఖలమైన అవినీతి, పూర్తి డబ్బుమయమైన రాజకీయాలు, పతనానికి చివరి దశలో ఉన్న వ్యవస్థ నుంచి ప్రజలను మేల్కొల్పే ప్రయత్నమే ఈ పుస్తకమని తెలిపారు.

views: 1263

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams