Current Affairs Telugu Daily

వెంట్రుకల రంగును నిర్ధారించడంలో 124 జన్యువులు 
మానవుల వెంట్రుకల రంగును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించే 124 జన్యువులను  బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఘటనా స్థలాల్లో దొరికిన డీఎన్‌ఏ ఆధారాలను విశ్లేషించడం ద్వారా నేరగాళ్ల వెంట్రుకల వర్ణాన్ని ఊహించేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడే అవకాశముంది. వెంట్రుకల రంగు చాలావరకు జన్యువులపై ఆధారపడి ఉంటుందని గతంలోనే పలు అధ్యయనాలు వెల్లడించాయి. దానికి సంబంధించి దాదాపు డజను జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు.
  • 3 లక్షల మంది డీఎన్‌ఏ డేటా, వారి వెంట్రుకల రంగును విశ్లేషించారు. మొత్తం 124 జన్యువులు శిరోజాల వర్ణాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఇందులోని చాలా జన్యువులు కొన్నిరకాల క్యాన్సర్లపై కూడా ప్రభావం చూపే అవకాశముందని వెల్లడించారు.

views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams