Current Affairs Telugu Daily

తెలంగాణలో అమల్లోకి నూతన పంచాయతీరాజ్‌ చట్టం
తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. నూతన చట్టంలోని 9 అంశాలు మినహా మిగతావన్నీ 2018 ఏప్రిల్‌ 18న నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • గ్రామ పంచాయతీ చెక్కులపై సర్పంచి సంతకంతో పాటు ఉపసర్పంచి సంతకం పెట్టానేది నూతన చట్టంలోని నిబంధన. కొత్త పాలకవర్గాలు కొలువుతీరిన తర్వాతే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  • ఇలాంటి 9 అంశాలను ప్రస్తుతం మినహాయించారు. ఇవి కూడా కొత్త పాలక వర్గాలు వచ్చాక మరో ఉత్తర్వు ద్వారా మనుగడలోకి వస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
  • తెలంగాణలో ఇంతవరకు 1994నాటి పంచాయతీరాజ్‌ చట్టం అమలయ్యింది. దీని స్థానంలో కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవల ఉభయసభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టింది.
  • బిల్లు  ఆమోదం పొంది చట్టంగా మారినా అమలు తేదీ ఖరారుపై కొంత జాప్యం ఏర్పడింది. చట్టం అమలు తేదీని ఏప్రిల్‌ 18గా గవర్నర్‌ నిర్ణయించటంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చట్టంలోని 9 అంశాలు తప్ప మిగతా వాటన్నింటికీ ఈ తేదీ వర్తిస్తుందని వాటిలో పేర్కొంది.
వాయిదాపడ్డ అంశాలు
  • చెక్కుపై సర్పంచితో పాటు కార్యదర్శి స్థానంలో ఉప సర్పంచి సంతకం 
  • ఆడిట్‌ పత్రాలు సమర్పించకపోతే సర్పంచి, కార్యదర్శిని విధుల్లోంచి తొలగించటం 
  • సర్పంచిని కలెక్టరు 6 నెలల చొప్పున రెండు విడతల్లో సస్పెండ్‌ చేయటం 
  • కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగ పరచకుంటే చర్యలు తీసుకోవటం 
  • లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం 
  • చర్యలపై విచారించేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు 
  • పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభకు హాజరుకావాల్సిన కనీస ప్రజల సంఖ్య (ఉదాహరణకు 500 మంది ఓటర్లుంటే కనీసం 50 మంది ప్రజలు రావాలి)

views: 838

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams