Current Affairs Telugu Daily

పెళ్లి చేసుకునే జంటలకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే ‘పెళ్లి కానుక’ 
కులమతాలకు అతీతంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వివాహం చేసుకోబోయే వారికి ‘పెళ్లి కానుక’ అందిస్తామని ఎమ్మెల్యే, నేమి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ చింతల రామచంద్రారెడ్డి ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న 23 మందికి 2018 ఏప్రిల్‌ 18న పెళ్లి కానుక కిట్లు అందజేశారు.
  • రాష్ట్రంలో ఇంతవరకూ ఏ శాసనసభ్యుడూ ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదని, వివాహ శుభలేఖతో సంప్రదిస్తే పెళ్లికి ముందే ఆ జంటకు రూ.50 వేల విలువైన మంగళసూత్రం, మెట్టెలు, నూతన వస్త్రాలు అందజేస్తామన్నారు.
  • నియోజకవర్గంలో ఉన్నట్లు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
  • వరుడు, వధువు ఎవరైనా ఆ ప్రాంత బీజేపీ బూత్‌ అధ్యక్షుడు, డివిజన్‌ అధ్యక్షుడికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతుల వివాహాకు కల్యాణలక్ష్మి పేరిట, ముస్లిం యువతుల వివాహానికి షాదీముబారక్‌ పేరిట రూ.1,00,116 ఆర్థిక సాయం చేస్తోంది

views: 993



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams