తెలంగాణ చేనేత, జౌళి శాఖలో 2 కొత్త కార్పొరేషన్లు 
తెలంగాణలో చేనేత, జౌళి రంగాల అభివృద్ధి కోసం కొత్తగా 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ(THDC), రాష్ట్ర మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ(TPTDC) పేరిట వీటిని స్థాపించేందుకు ప్రభుత్వం ఆదేశించింది.
  • ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో టెస్కో సంస్థ పనిచేస్తోంది.
  • మరమగ్గాలకు ఎలాంటి కార్పొరేషన్‌ లేదు.
  • చేనేత, జౌళి రంగాలను సూక్ష్మస్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు వీలుగా వాటి కోసం ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  
  • ఒక్కో కార్పొరేషన్‌కు రూ.5.10 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంచాలకులుగా రాష్ట్ర చేనేత కమిషనర్‌ శైలజారామయ్యర్‌, ఉప కార్యదర్శి కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.
  • కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు దృష్ట్యా టెస్కో రద్దు కానుంది.
  • రాష్ట్ర విభజన తర్వాత ఆప్కోను విభజించి, తెలంగాణకు టెస్కోని ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఆస్తులు, అప్పుల లెక్కలు, సిబ్బంది విభజన పూర్తయిన తర్వాత టెస్కోను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

views: 665

Current Affairs Telugu
e-Magazine
May-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams