Current Affairs Telugu Daily

డోక్ర కళాకృతులు, వరంగల్‌ దరీస్‌కు భౌగోళిక గుర్తింపు 
తెలంగాణలో గల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇత్తడి లోహంతో కళాకృతులను రూపొందిస్తున్న డోక్ర వృత్తిదారుల కళాఖండాలకు, వరంగల్‌లోని చేనేత కార్మికులు రూపొందించే ‘దరీస్‌’కు జీఐ రిజిష్ట్రరీ చెన్నై భౌగోళిక గుర్తింపునిచ్చింది.
  • ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాలోని వందలాది మంది కళాకారులు డోక్ర వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.
  • ప్రస్తుతం వీరు స్థానికంగా లభించే మట్టి, మైనంతో, గుడిగంటలు, తాబేలు, గుర్రాలు, అటవీజంతువులు, గిరిజనులు పూజించే దేవతామూర్తులు, పోరాట యోధులు నాయకుల ప్రతిమను రూపొందిస్తున్నారు.
  • వివిధ ఆకృతులను తయారు చేసినా, మార్కెట్‌ సదుపాయం లేకపోవడం వల్ల వివిధ గ్రామాల్లోని సంతల్లో విక్రయిస్తున్నారు.
  • డోక్ర ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు దక్కడం వల్ల కళాకారుల ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
  • కుమురం భీం జిల్లాలోని కేస్లగూడ గ్రామస్థులు ఇత్తడి విగ్రహాలను తయారు చేయడంలో ప్రసిద్ధి.
  • ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఈ గ్రామానికి చెందిన కోవ నానేశ్వర్‌ ఆయన చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
  • వరంగల్‌లోని కొత్తవాడలో దాదాపు 2000 చేనేత కుటుంబాలు దరీస్‌ (జంపఖానా)లు నేస్తూ జీవనం సాగిస్తాన్నాయి.
  • ఆకట్టుకునే డిజైన్లలో వీరు నేసే జంపఖానాలకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.
  • చేనేత అభివృద్ధి సంస్థ సహకారంతో భారత పరిశ్రమ సమాఖ్య 2015లో వరంగల్‌ దరీస్‌కు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం మొదలుపెట్టింది.
  • ‘జీఐ’ గుర్తింపునకు 2015 మార్చి 6న దరఖాస్తు చేయగా ఇప్పుడు గుర్తింపు ఇచ్చింది. దీని వల్ల వరంగల్‌ దరీస్‌కు గిరాకి మరింత పెరిగే అవకాశముంది. 

views: 923Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams