Current Affairs Telugu Daily

డెంగీ జ్వరానికి ఆయుర్వేద ఔషధం ఆవిష్కరణ
డెంగీ జ్వరాన్ని నయం చేసే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలోనే తొలి ఆవిష్కరణగా భావిస్తున్న ఈ మందును 2019లో మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. కర్ణాటక బెల్‌గామ్‌లోని కేంద్ర ఆయుర్వేదిక్‌ శాస్త్ర పరిశోధన మండలి (CCRAS)కి చెందిన ప్రాంతీయ కేంద్రం ఇప్పటికే ఈ మందుపై ప్రయోగాత్మక అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
  • ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) పరిధిలోని స్వయంప్రతిపత్తిత  సంస్థ అయిన సీసీఆర్‌ఏఎస్‌ నిర్వహించిన పరీక్షల్లో ఈ మందు సురక్షితంగా, సమర్ధంగా పనిచేస్తుందని తేలింది. 
  • శతాబ్దాల తరబడి ఆయుర్వేద వైద్య విధానంలో వినియోగిస్తున్న 7 రకాల మొక్కలకు చెందిన (హెర్బల్‌) దినుసులతో ఈ మందును తయారుచేశారు. 
  • డెంగీకి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు 2015లో ఉపక్రమించారు. గతేడాది జూన్‌ నాటికి రూపొందించారు. 
  • గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రితో పాటు.. బెల్‌గామ్‌, కోలార్‌లోని వైద్య కళాశాలల్లో ప్రయోగాత్మక అధ్యయనాలను పూర్తిచేశారు. 
  • ప్రయోగ పరీక్షల్లో 90 మంది రోగులకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. ద్రవ రూపంలో మందును అందించారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్‌ పరీక్ష అనంతరం దీన్ని మాత్రల (ట్యాబ్లెట్‌) రూపంలో అందజేస్తారు.
  • దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో డెంగీ జ్వరమే అత్యంత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏటా దాదాపు 40 కోట్ల మందికి సోకుతున్నట్లు అంచనా. 
  • భారత్‌లో 2017లో (డిసెంబరు 24 నాటికి) 1,57,220 కేసులు నమోదు కాగా.. 250 మంది మృతి చెందారు. 2016లో 1,29,166 కేసులు నమోదు కాగా 245 మరణాలు సంభవించాయి.
ICMR-Indian Council of Medical Research
CCRAS-Central Council for Research in Ayurvedic Sciences

views: 868

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams