Current Affairs Telugu Daily

వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల పునరుద్ధరణ 
కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను తెలంగాణ శాసనసభ నుంచి బహిష్కరించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వారిరువురిని బహిష్కరిస్తూ 2018 మార్చి 13న సభ జారీచేసిన ఉత్తర్వులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీచేసిన ప్రకటనను రద్దుచేసింది. ఆయా నియోజకవర్గాలలో వారి సభ్యత్వం పునరుద్ధరణ అవుతుందని స్పష్టం చేసింది.
  • ఎమ్మెల్యేలుగా వారి మిగిలిన పదవీకాలం అన్ని అంశాల్లో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.
  • సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా పిటిషనర్లపై బహిష్కరణ వేటు వేశారని తేల్చిచెప్పింది.
  • ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఈ మేరకు ఎమ్మెల్యేల బహిష్కరణ ఉత్తర్వులను రద్దుచేస్తూ 172 పేజీల తీర్పును వెలువరించారు.

views: 788



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams