Current Affairs Telugu Daily

దళిత భక్తుడిని భుజాలపై మోసిన అర్చకుడు 
దళిత భక్తుడిని ఓ ప్రధానార్చకుడు తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించిన అరుదైన ఘట్టం హైదరాబాద్‌లో 2018 ఏప్రిల్‌ 16న ఆవిష్కృతమైంది. జియాగూడలోని చారిత్రక రంగనాథస్వామి దేవస్థానం ఇందుకు వేదికైంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సి.ఎస్‌.రంగరాజన్‌, రంగనాథస్వామి దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ ఎస్‌.టి.చారి, ఆలయ నిర్వాహకులు శృంగారం శేషాచార్యులు, అర్చకులు రాజగోపాలాచార్యులు, బద్రిచార్యులు, వంశీ తదితరుల నేతృత్వంలో మునివాహన సేవా మహోత్సవం పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన దేవీ ఉపాసకులు, దళిత భక్తుడైన ఆదిత్యపరాశ్రీని రంగరాజన్‌ తన భుజాలపైకి ఎక్కించుకుని ఆలయంలోకి మోసుకుని తీసుకువెళ్లి శ్రీరంగనాథస్వామి దర్శనాన్ని కల్పించారు. 
views: 848

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams