Current Affairs Telugu Daily

IRCTC నిబంధనల్లో మార్పులు
ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గాను భారతీయ రైల్వేశాఖ ఆన్‌లైన్‌ విధానాన్ని మరింత పటిష్ఠపరిచడంతో పాటు, తత్కాల్‌ విధానం దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టింది. ఈమేరకు నిబంధనల్లో IRCTC పలు మార్పులు, చేర్పులు చేసింది.
  • వినియోగదారులు (యూజర్లు) ఒక ఐడీ నుంచి నెలకు గరిష్ఠంగా 6 టిక్కెట్లు పొందవచ్చు. అదే ఆధార్‌తో అనుసంధానమైతే 12 టిక్కెట్లు వరకు బుక్‌ చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10 గంటల వరకు ఒకరు కేవలం 2 టిక్కెట్లు మాత్రమే బుక్‌ చేసుకునే వీలుంటుంది. 
  • త్వరతిగతిన బుక్‌ చేసుకునే విధానం (సింగిల్‌ పేజ్‌ లేదా క్విక్‌బుక్‌ సర్వీస్‌) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వీలుపడదు. ఒకసారి ఒక యూజర్‌ ఒకచోట మాత్రమే లాగిన్‌ కావడానికి వీలుపడుతుంది. ఇందుకుగాను ముందు సంకేతపదం (కేప్చా) నమోదు చేయాలి. 
  • మారిన విధానంలో IRCTCలో నమోదుకు గాను యూజర్లు తమ వ్యక్తిగత వివరాలను పేర్కొన్న అనంతరం భద్రతపరమైన ఓ ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉంటుంది. 
  • IRCTC అధీకృత ఏజెంట్లు ఉదయం 8.00-8.30, 10.00-10.30, 11.00-11.30 గంట మధ్య మాత్రమే టిక్కెట్లు బుక్‌ చేయడానికి వీవుతుంది. రోజులో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రారంభమైన సమయం నుంచి తొలి అరగంట వరకు ట్రావెల్‌ ఏజెంట్లు తత్కాల్‌ టిక్కెట్లు బుక్‌ చేయడానికి వీలు పడదు.
  • ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుకింగ్‌కు పట్టే సమయం చాలా విలువైనది.. కీలకమైనది. ఆ సమయంలో పోటీ, రద్దీ తీవ్రంగా ఉంటాయి. ఈమేరకు ప్రయాణికుల వివరాలను నమోదుకు పట్టే  ప్రామాణిక సమయం 25 సెకెన్లుగా నిర్ధారించారు. ప్రయాణికుల వివరాలు పేర్కొనే పేజీలో సంకేతపదాన్ని నింపడానికి ప్రామాణిక సమయం కనిష్ఠంగా 5 సెకెన్లు. 
  • నెట్‌ బ్యాంకింగ్‌ తదితర డిజిటల్‌ చెల్లింపులకు ఓటీపీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. రిజర్వేషన్‌ టిక్కెట్లకు రుసుము చెల్లింపునకు 10 సెకెన్ల సమయాన్ని కేటాయించారు.
  • ప్రయాణ సమయానికి ఒక రోజు ముందు తత్కాల్‌ టిక్కెట్లు పొందవచ్చు. ఇందుకుగాను ఏసీ తరగతి బెర్తులకు ఉదయం 10 నుంచి.. స్లీపర్‌కు 11 గంటల నుంచి బుకింగ్‌ ప్రారంభమవుతుంది. 
  • రైలు నిర్ణీత సమయం కంటే 3 గంటల్లోపు బయల్దేరకపోతే.. టిక్కెట్‌ ధర, తత్కాల్‌ ఛార్జీలను పూర్తిగా తిరిగి (రిఫండ్‌) పొందవచ్చు. 
  • ఒకవేళ రైలు ప్రయాణ మార్గాన్ని మార్చాల్సి వస్తే.. అలా ప్రయాణించడం ఇష్టం లేకపోయినా పూర్తి టిక్కెట్‌ ధరను తిరిగి పొందవచ్చు. 
  • ప్రయాణికులెవరైనా తాము ఉన్నత శ్రేణి టిక్కెట్‌ పొంది.. అంతకంటే దిగువశ్రేణిలో ప్రయాణించాల్సి వస్తే.. దానికి ఇష్టంలేకపోతే పూర్తి టిక్కెట్‌ ధరను తిరిగి పొందవచ్చు. ఒకవేళ ప్రయాణానికి ఇష్టపడితే రెండు ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తిరిగి చెల్లిస్తారు.
IRCTC-Indian Railway Catering and Tourism Corporation

views: 782

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams