ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదార్లు, నగరాల్లో గరిష్ఠ వేగ పరిమితి పెంపు
ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై మరింత వేగంగా దూసుకుపోవడానికి వీలుగా గరిష్ఠ వేగపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఎక్స్‌ప్రెస్‌వేపై వ్యక్తిగత నాలుగు చక్రాల వాహనాలు ఇకపై గంటకు 120 కి.మీ. వేగంతో దూసుకుపోవచ్చు. గతంలో ఇది 100 కి.మీ. మాత్రమే.
  • ట్యాక్సీలు, క్యాబ్‌లు 100 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. ఇప్పటివరకు ఇది 80 కి.మీ.కు పరిమితం.
  • జాతీయ రహదార్లపై కార్లు  100 కి.మీ., ట్యాక్సీలు, క్యాబ్‌లు 90 కి.మీ., ద్విచక్రవాహనాలు 80  కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.
  • నగర రహదారుల్లో వ్యక్తిగత కార్లు, ట్యాక్సీలు 70  కి.మీ., ద్విచక్రవాహనదారులు 60  కి.మీ. గరిష్ఠ వేగంతో దూసుకెళ్లవచ్చు.
  • వాహనదారుల వేగానికి కళ్లెంవేసేలా పలు నిబంధనలు విధించారు. ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ రహదార్లకు మాత్రమే ఇవి వర్తిసాయి.
  • ప్రమాదకరమైన మలుపుల వద్ద, కనిష్ఠవేగాన్ని పాటించాల్సిన ప్రాంతాలు, పట్టణ, గ్రామం గుండా రహదార్లు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గరిష్ఠ వేగాన్ని మించకూడదు.

views: 732

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams