సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేవాలయాలకు రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్సెట్లు, గొడుగులను రాయితీపై అందిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం 2018 ఏప్రిల్ 15న వెల్లడించింది.
రాతి విగ్రహాల విలువ వాటి కొలత ఆధారంగా ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలు, ఇతరులకు 75 శాతం రాయితీపై అందిస్తున్నారు.
పంచలోహ విగ్రహాల విలువ కూడా కొలతల ఆధారంగానే ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ, బీసీ, ఇతరులకు 75 శాతం రాయితీపై అందజేస్తున్నారు.
మైక్సెట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ, ఇతరులకు 50 శాతం రాయితీతో ఇస్తారు.
గొడుగులను మాత్రం అందరికీ 50శాతం రాయితీపై టీటీడీ అందించనుంది.
స్థానిక తహసీల్దారు నుంచి ఆలయ పరిధిలో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సిఫారసు లేఖతో టీటీడీ కార్యనిర్వహణాధికారి లేదా పాలకమండలి అధ్యక్షులకు ఆలయ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత దరఖాస్తుతో పాటు ఆలయ ఫొటో, దేవాలయం నమూనా, దరఖాస్తు చేస్తున్న వారి చిత్రాన్ని కూడా జత చేయాల్సి ఉంటుంది.