Current Affairs Telugu Daily

ఆంధ్రుల ఆత్మగౌరవం గీతావిష్కరణ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 5 కోట్ల ఆంధ్రులను దగా చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ రూపొందించిన ఆంధ్రుల ఆత్మగౌరవం గీతాన్ని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజయవాడలో ఆవిష్కరించారు. హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరాన్ని ఇందులో ప్రస్తావించారు.
  • సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ గీతానికి యశోకృష్ణ స్వరాలు సమకూర్చగా రాంకీ బృందం గానం చేసింది.
  • ఓల్గా ఆర్చరీ ప్రొడక్షన్స్‌ పతాకంపై చెరుకూరి సత్యనారాయణ ఈ గీతానికి దృశ్యరూపం ఇచ్చారు. 

views: 885



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams