Current Affairs Telugu Daily

ప్రకృతి ప్రేమికుడు కామేగౌడకు బసవశ్రీ పురస్కారం 
చిత్రదుర్గంలోని శ్రీ మురుఘ రాజేంద్ర బృహన్మఠం ప్రతి సంవత్సరం అందించే బసవశ్రీ పురస్కారాన్ని 2017 సం॥నికి గాను గొర్రెల కాపరి కామేగౌడకు 2018 ఏప్రిల్‌ 15న ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, పురస్కార పత్రం, రూ.5 లక్షల చెక్కు అందజేశారు. బాల్యం నుంచి గొర్రెల కాపరి అయిన కామేగౌడ నిత్యం తాను సంచరించే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి గుంతలు ఏర్పాటు చేశారు. పురాతన కాలం నాటి జల మూలాలు, చెరువులను సంరక్షించుకుంటే నీటికి కొరత ఉండదనేది ఆయన సిద్ధాంతం. ఆ సేవలను గుర్తించిన మఠం బసవశ్రీ పురస్కారంతో సత్కరించింది.
views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams