Current Affairs Telugu Daily

VHP అంతర్జాతీయ అధ్యక్షుడిగా కోక్జే 
విశ్వ హిందూ పరిషత్‌ (VHP) నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ వీఎస్‌ కోక్జే 2018 ఏప్రిల్‌ 14న ఎన్నియ్యారు.
  • ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ పదవికి ఎన్నికలు నిర్వహించారు.
  • గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో 190 మందికి పైగా VHP ప్రతినిధులు ఓటు వేశారు. కోక్జేకి 131 ఓట్లు రాగా.. ప్రస్తుత అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డికి 60 మంది ఓటు వేశారు. కొత్త అంతర్జాతీయ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో VHP సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.
  • VHP ఏర్పాటు - 1964
  • VHP ప్రధాన కార్యాయం - న్యూడిల్లీ 
  • VHP వ్యవస్థాపకులు - ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌, కేశవరాం కాశీరాం శాస్త్రి, ఎస్‌.ఎస్‌.ఆప్టే
VHP-Vishva Hindu Parishad

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams