Current Affairs Telugu Daily

కృషి విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు గోపాల్‌రెడ్డి మృతి
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకానికి ఆద్యులు, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్‌ గంటా గోపాల్‌రెడ్డి  2018 ఏప్రిల్‌ 14న మృతి చెందారు.
  • సాగర్‌ ఎడమ కాల్వపై రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని(మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం) నిర్మించడంలో గోపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.
  • శ్రీ అరవిందో గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేయించారు.
  • దేశ వ్యాప్తంగా కేవీకేల ఏర్పాటులోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ కోట్ల రూపాయలను ప్రజలు, రైతుల అభివృద్ధికి వెచ్చించారు. 
KVK-Krishi Vigyan Kendra

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams