Current Affairs Telugu Daily

కాలేయ వ్యాధుల సరికొత్త చికిత్సా విధానం DAA
హెపటైటిస్‌-సీ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ లాంటి కాలేయ వ్యాధులకు కళ్లెంవేసే సరికొత్త చికిత్సా విధానాన్ని పరిశోధకులు కనిపెట్టారు. వైరస్‌పై పోరాడే డైరెక్ట్‌ యాక్టింగ్‌ యాంటీవైరల్‌ ఏజెంట్లు(DAA)ను ఒకేసారి సామూహికంగా ఇవ్వడంతో మంచి ఫలితాలుంటాయని తేల్చారు.
  • మన దేశంలో హెపటైటిస్‌-సీ బాధితులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రాముఖ్యం సంతరిచుకుంది. పంజాబ్‌లో దీన్ని నిర్వహించారు.
  • 19,646 మంది దీనిలో పాల్గొన్నారు. వీరిలో 42ఏళ్లకు పైబడిన పురుషులు 61.7 శాతం మంది వున్నారు. 12 వారాల పాటు వీరికి డీఏఏ ఔషధాలను ఇచ్చి ఫలితాలను పరీక్షించారు. దీంతో కాలేయం దెబ్బతిన్నవారిలో 90 శాతం మందికిపైగా రోగులు చక్కగా కోలుకుంటున్నట్లు తేలింది.
DAA-Direct Acting Antivirals

views: 937



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams