Current Affairs Telugu Daily

సూర్యాపేటలో ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర సహజ వనరులు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2018 ఏప్రిల్‌ 14న తెలంగాణలోని సూర్యాపేటలో ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 20 మంది లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందించి పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయడమే ఈ పథకం ఉద్దేశం.
views: 1019



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams