Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ లుమినరీ లెక్చర్‌ సిరీస్‌ 
ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ లుమినరీ లెక్చర్‌ సిరీస్‌ పేరిట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్‌ సభ్యులు వి.కె.సారస్వత్‌,  కేంద్ర రక్షణ మంత్రి సైంటిఫిక్‌ అడ్వైజర్‌ డా॥ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. భవిష్యత్‌ తరం మిసైళ్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా మైనింగ్‌ పరిజ్ఞానం కీలక పాత్ర పోషించనుందని వి.కె.సారస్వత్‌ అన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో కమ్యూనికేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డేటా స్టోరేజ్‌ కోసం ఎంబెడ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఉండాల్సిందేనని, సూక్ష్మమధ్య తరగతి పరిశ్రమలు, స్టార్టప్‌ కంపెనీలు ఈ రంగంపై దృష్టి సారించాలన్నారు.
views: 936



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams