Current Affairs Telugu Daily

మాజీ సీఎండీ కుట్రతో యూకో బ్యాంకుకు రూ.737 కోట్లు నష్టం 
రుణాలు, నిరర్థక ఆస్తుల పేరిట జరిగిన కుట్రలో యూకో బ్యాంకు వంద కోట్లు నష్టపోయింది. ఇందులో ఆ బ్యాంకు మాజీ సీఎండీయే ప్రధాన సూత్రధారి అని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకు రుణాల పేరిట యూకో బ్యాంకుకు రూ.621 కోట్ల మేరకు నష్టం కలిగించిన ఆరోపణలపై ఆ బ్యాంకు మాజీ సీఎండీ అరుణ్‌కౌల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2015 వరకు బ్యాంకు సీఎండీ పనిచేసిన కౌల్‌ కారణంగా బ్యాంకుకు రూ.737 కోట్లు నష్టపోయిందని సీబీఐ ఆరోపించింది. మోసం చేయాలనే కుట్రతోనే కంపెనీలకు రుణాలు మంజూరు చేయించినట్లు తెలిపింది. 
  • యూకో బ్యాంకు ప్రధాన కార్యాలయం - కోల్‌కత
  • యూకో బ్యాంకు వ్యవస్థాపకులు - ఘన్‌శ్యాందాస్‌ బిర్లా 

views: 907



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams