Current Affairs Telugu Daily

ఘనంగా అంబేద్కర్‌ 127వ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ 127వ జయంతిని 2018 ఏప్రిల్‌ 14న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడిలు పార్లమెంటు హౌస్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
  • అంబేద్కర్‌ జన్మించిన ఇండోర్‌లోని మావ్‌(అంబేడ్కర్‌నగర్‌గా 2003లో నామకరణం)లో జరిగిన జయంతి వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా తాను భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్‌కు శిరసు వంచి అభివాదం చేస్తున్నానన్నారు.
  • మావ్‌ కంటోన్మెంట్‌లో అంబేద్కర్‌ పుట్టిన ప్రాంతాన్ని ఓ భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి.
  • కలీప్టన్‌ ప్రాంతంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించిన అంబేడ్కర్‌ స్మారకాన్ని కోవింద్‌ సందర్శించారు. అనంతరం దళితులతో కలిసి కూచుని సహపంక్తి భోజనం చేశారు.
  • రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  ‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌: వ్యక్తి నహీ సంకల్ప్‌’ అనే పుస్తకం తొలిప్రతిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వీకరించారు. 

views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams