గ్రామీణ ప్రాంత ప్రజలు.. ప్రధానంగా దళితులు, గిరిజనులకు చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు వివిధ సంక్షేమ పథకాలతో కూడిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ను ప్రారంభించాయి. అంబేడ్కర్ జయంతి సందర్భంగా 2018 ఏప్రిల్ 14న చత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఆయుష్మాన్ భారత్ సహా వివిధ పథకాలను ప్రారంభించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తెండూ ఆకును ఏరుకునే గిరిజన మహిళకు పాదరక్షలు అందజేసిన మోడి ఆ మహిళకు పాదరక్షలు వేసుకునేందుకు సహకరించారు.
‘గ్రామస్వరాజ్ అభియాన్’ 2018 మే 5 వరకు కొనసాగనుంది
50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీలున్న ప్రతి గ్రామానికీ వెళ్లాలని.. ఎల్పీజీ కనెక్షన్లు, పిల్లలకు టీకాలు, జన్‌ధన్ ఖాతాలు, విద్యుత్తు సౌకర్యం కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని మోడి పార్టీ ఎంపీలు, మంత్రులకు సూచించారు. ప్రతి గ్రామంలో ఎంపీలు కనీసం ఒక రోజు, కేంద్ర మంత్రులు వేర్వేరు ప్రాంతాల్లో రెండు రాత్రులు బస చేయాలని స్పష్టం చేశారు.
2018 ఏప్రిల్ 18న స్వచ్ఛభారత్ ఉత్సవం, 2018 ఏప్రిల్ 20, 24, 28 ఉజ్వల, పంచాయతీరాజ్, గ్రామశక్తి దివస్, 2018 ఏప్రిల్ 30, మే 2, 5 తేదీల్లో రైతులు, పేదలకు ప్రత్యేకించి వివిధ పథకాలను ప్రారంభిస్తారు.