Current Affairs Telugu Daily

‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప్రారంభం
ప్రధాని నరేంద్రమోడి 2018 ఏప్రిల్‌ 14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • ఈసారి బడ్జెట్‌లో కేంద్రం పేర్కొన్న ‘వన్‌ధన్‌’ పథకాన్ని కూడా ప్రధాని మోడి ప్రారంభించారు. దీని కింద అటవీ ఉత్పత్తులను మెరుగుపరిచి, వాటికి మార్కెట్‌ సదుపాయం కల్పిస్తారు. ఇందుకు వనవికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
  • మావోయిస్టు ప్రాబల్యమున్న బస్తర్‌ జిల్లాలో కొత్త రైల్వేమార్గం, రహదారులు, వంతెన పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మావోయిస్టుల  కంచుకోటగా ఉన్న బస్తర్‌ భవిష్యత్తులో ఆర్థిక, రవాణా కేంద్రంగా విలసిల్లనుందని ప్రధాని హామీ ఇచ్చారు.
  • గిరిజన ప్రాంతమైన బీజాపూర్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోడి. 
  • చత్తీస్‌గఢ్‌ రాజధాని - రాయ్‌పూర్‌
  • చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి - రమణ్‌సింగ్‌
  • చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ - బలరాందాస్‌ టాండన్‌
  • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి - జేపీ నడ్డా 

views: 989



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams