Current Affairs Telugu Daily

4.41% పెరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదాయం
వివిధ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో 4.41% మేర పెరిగింది. వాణిజ్య పన్నులు , మద్యం, స్టాంపు, రిజిస్ట్రేషన్‌, గనులు, భూములు, అటవీశాఖ ద్వారా 2016-17లో రూ.46,560.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2017-18)లో ఈ ఆదాయం రూ.53,204.57 కోట్లకు చేరింది. అదనంగా పెరిగిన ఆదాయం రూ.6,644.51 కోట్లు. 
  • మద్యం ధరల పెరుగుదలతో ఎక్సైజ్‌ ఆదాయంపెరిగింది. 
  • స్టాంపు, రిజిస్ట్రేషన్‌ శాఖ వసూళ్లలో 21.91% వృద్ధి కనిపించింది. పెరిగిన సేవల రుసుము, పెద్దనోట్ల రద్దు ప్రభావం క్రమేపీ తగ్గి స్థిరాస్తి రంగం పుంజుకుంది. 
  • జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టం కేంద్రం ద్వారా కొంతమేర భర్తీ అయింది.

views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams