Current Affairs Telugu Daily

అర్ధంతరంగా ముగుస్తున్న ఆదివాసీల జీవితం
దేశంలోని ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే ఆదివాసీలు అల్పసంఖ్యాక ముస్లింలు, షెడ్యూల్డ్‌ కులాల వారు ముందుగానే మృత్యువాతపడుతున్నారని, ఇతర వర్గాల ప్రజలతో పోల్చితే సరైనస్థాయిలో వైద్యసేవలు అందకపోవడంతో ఆరోగ్యం క్షీణించి చిన్నవయసులోనే చనిపోతున్నట్టు ఓ విశ్లేషణలో వెల్లడైంది. ఉన్నత తరగతులు, ముస్లిమేతర వర్గాలకు చెందిన వారితో పోలిస్తే ఈ వర్గాలకు సరైన వైద్య, ఆరోగ్య సేవలు అందడం లేదని అధ్యయనంలో తేలింది. ‘భారత్‌లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004-14కాంలో)’ పేరిట ఆర్థికవేత్త వాణీకాంత్‌ బారువా జరిపిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
  • సామాజికంగా అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలపై వైద్య, ఆరోగ్యసేవల ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది.
  • 2004-14లో ఆదివాసీ జీవితకాలం తగ్గింది. 2004 వరకు ఎస్టీల సగటు జీవితకాలం  45 సం॥లు కాగా, తర్వాతి దశకంలో అది మరింత తగ్గింది.
  • ఎస్సీల సగటు జీవితకాలం  42 సం॥లు కాగా 2014నాటికి అది మరో ఆరేళ్లు పెరిగింది.
  • ముస్లిమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవితకాలం  2004లో 55 సం॥లు ఉండగా అది 2014లో 66 సం॥లకు పెరిగింది.
  • దీనికి ఆరోగ్య, వైద్యసేవల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తిన అసమానతలే ప్రధాన కారణమని బారువా విశ్లేషించారు.
  • ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే ఎస్టీలు తక్కువ వయసులోనే చనిపోతున్నారు. తాము అనారోగ్యం బారినప డ్డామని కేవలం 24 శాతం మంది మాత్రమే వెల్లడిస్తున్నారు. 2004లో ఇది 19 శాతంగా ఉంది. ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు. 
2004, 2014లో సామాజిక వర్గాల సగటు జీవితకాలం 
                                                    2004         2014
ముస్లిమేతర ఉన్నత వర్గాలు       55             60
ముస్లిమేతర ఓబీసీలు                  49              52 
ఓబీసీ ముస్లింలు                          43              50
ఉన్నతవర్గ  ముస్లింలు                 44             49 
షెడ్యూల్డ్‌ కులాలు                        42              48 
షెడ్యూల్డ్‌ తెగలు                           45              43

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams