Current Affairs Telugu Daily

PMAYలో చివరి స్థానంలో తెలంగాణ 
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY‌) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంలో తెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది. మొత్తం 9 కొలమానాల ఆధారంగా కేంద్రం రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించగా అందులో 0%తో తెలంగాణ  చివరి స్థానంలో నిలిచినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారులు వెల్లడించారు.
  • కేటాయించిన ఇళ్లలో 43% ప్రగతి సాధించి ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు.
  • ఇళ్ల నిర్మాణంలో సాధించిన పురోగతిని బట్టి గ్రామీణాభివృద్ధిశాఖ నాలుగు వర్గాలుగా విభజించింది.
  • 86% పురోగతితో ఛత్తీస్‌గఢ్‌ తొలిస్థానంలో నిలిచింది.
  • ఇళ్ల నిర్మాణంతో ముడిపడిన 9 అంశాలను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.
  • రాష్ట్రాలకు కేటాయించిన 94 లక్షల ఇళ్లలో ఇప్పటివరకూ 44.50 లక్షల ఇళ్లు పూర్తి చేశారు.
  • 2016 నవంబరు 20న ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 మార్చికల్లా కోటి ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
PMAY-Pradhan Mantri Gramin Awaas Yojana

views: 1112

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams