బాలల అపహరణ కేసుల పరిష్కారానికి భారత్ సహకారం: అమెరికా
బాలల అపహరణకు సంబంధించిన కేసులను పరిష్కరించే దిశగా భారత్ తమతో కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది. అపహరణకు గురైన పిల్లలను సొంత దేశాలకు అప్పగించేందుకు వీలుగా 1980లో హేగ్ సదస్సులో రూపొందించుకున్న అంతర్జాతీయ ఒడంబడికలో చేరాల్సిందిగా కూడా భారత్‌ను కోరినట్లు తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖలో చిన్నారుల అంశాలపై ప్రత్యేక సలహాదారుగా ఉన్న సుజానే ఐ లారెన్స్ ప్రపంచ ఆరోగ్యం, మానవ హక్కులకు సంబంధించిన కాంగ్రెస్ కమిటీ ముందు ఈ వివరాలు వెల్లడించారు.
views: 983