Current Affairs Telugu Daily

జూన్‌లో రూ.100 కొత్త నోటు 
రూ.100 కొత్త నోట్లను ప్రవేశ పెట్టాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయించింది. లేత నీలి రంగులో, ప్రస్తుత నోట్‌ పరిమాణంతో పోలిస్తే 20 శాతం చిన్నదిగా, తక్కువ బరువుతో ఉండే కొత్త రూ.100 నోటును జూన్‌లో మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టాలని RBI భావిస్తోంది. నకిలీ నోట్లు తయారు చేయకుండా, అత్యధిక భద్రతా అంశాలు ఈ నోటులో ప్రవేశ పెట్టనున్నారు.
  • 2016 నవంబరులో రూ.500, 1000 నోట్లు రద్దు చేశాక రూ.2000, 500, 200 నోట్లను RBI ప్రవేశపెట్టింది.
  • తక్కువ మొత్తం నోట్లు అధికంగా అందుబాటులోకి తేవడంతో పాటు, పాతనోట్లను క్రమంగా ఉపసంహరించేందుకు కొత్తవి ప్రవేశ పెడుతున్నారు.
  • 2018 మార్చి 23 నాటికి దేశంలో చెలామణి ఉన్న నగదు విలువ రూ.18.27 లక్షల కోట్లు. పెద్దనోట్ల రద్దుకు ముందు ఉన్న మొత్తం రూ.17.97 లక్షల కోట్లు కంటే ఇవి అధికం. 2017 మార్చి 23 నాటికి చెలామణిలో ఉన్న నగదు విలువ రూ.13.35 లక్షల కోట్లు మాత్రమే.
  • ప్రతి వారం సగటున 0.6 శాతం చొప్పున నగదును మార్కెట్‌లోకి RBI సరఫరా చేస్తోంది.
  • RBI ఛైర్మన్‌ - ఉర్జిత్‌ పటేల్‌
RBI-Reserve Bank of India

views: 948Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams