Current Affairs Telugu Daily

కొండ ప్రాంతాల్లో రైల్వేలైన్లపై సర్వేకు డ్రోన్లు
వచ్చే వర్షాకాలంలో కొండప్రాంతాల్లోని రైల్వేలైన్ల సర్వేకు డ్రోన్లను వినియోగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ముంబై -పూణే, ముంబై -నాసిక్‌ రైలు మార్గాల్లో సహ్యాద్రి పర్వతాలున్నాయి. వర్షాకాలంలో భారీవర్షాల వల్ల ఈ రైలు మార్గాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుండటం వల్ల రైలు ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల సాయంతో సర్వే నిర్వహిస్తూ రైళ్లు నడపాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
  • మంకీ హిల్స్‌, కాసర ఘాట్‌ ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. దీనివల్ల రైలు ప్రమాదాలు వాటిల్లకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ నుంచి కల్యాణ్‌ సెక్షన్‌ లో డ్రోన్లతో సర్వే నిర్వహించనున్నారు. 

views: 878

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams