Current Affairs Telugu Daily

తాజ్‌మహల్‌ విషయంలో షాజహాన్‌ సంతకం పత్రాలు సమర్పించాలని యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం 
తాజ్‌మహల్‌కు మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ యజమాని అని రుజువు చేసేలా ఆయన సంతకంతో కూడిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • తాజ్‌మహల్‌ను తమ ఆస్తిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని యూపీ వక్ఫ్‌బోర్డు 2005 జులైలో తీసుకున్న నిర్ణయాన్ని భారత పురావస్తు శాఖ 2010లో న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. అప్పటినుంచి వక్ఫ్‌బోర్డు నిర్ణయంపై స్టే ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై 2018 ఏప్రిల్‌ 11న విచారణ కొనసాగించింది.
  • ‘తాజ్‌మహల్‌ వక్ఫ్‌బోర్డుదంటే ఈ దేశంలో ఎవరైనా విశ్వసిస్తారా? అలాంటి వక్ఫ్‌నామాపై షాజహాన్‌ ఎలా సంతకం చేస్తారు? దానిని మీకెప్పుడు ఇచ్చారు? ఇలాంటి అంశాలతో న్యాయస్థానం సమయాన్ని వృథా చేయకండి’ అని సీజేఐ చెప్పారు.
  • ‘షాజహాన్‌ ఆగ్రాకోటలో బందీగా ఉంటూ తన గది కిటికీ నుంచి తాజ్‌మహల్‌ను చూసేవారు. కస్టడీలో ఉండగా ఆయన వక్ఫ్‌నామాపై సంతకం ఎలా చేయగరు? ఆయన చేతిరాతతో అలాంటి పత్రాలుంటే సమర్పించండ’ని జస్టిస్‌ దీపక్‌మిశ్ర ఆదేశించారు.
  • తాజ్‌మహల్‌ను నిర్మించిన తర్వాత కుమారుడు ఔరంగజేబు కారణంగా ఆగ్రా కోటలో 18 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్న షాజహాన్‌ ఆ తర్వాత మృతి చెందారు. 
  • ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి మొఘలు వారసుడినైన తనను తాజ్‌మహల్‌కు సంరక్షకునిగా నియమించేలా ఆదేశాలివ్వాలని మొదట అలహాబాద్‌ హైకోర్టులో కేసు వేశారు. జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించి, వక్ఫ్‌బోర్డుకే నివేదించుకోవాలని సూచించింది. వక్ఫ్‌బోర్డు అది తమ ఆస్తి అని పేర్కొంది. 

views: 887

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams