Current Affairs Telugu Daily

ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 130వ స్థానం
ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌ 130వ స్థానంలో నిలిచింది. గతేడాది సాధించిన ర్యాంకు కంటే 13 స్థానాలు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన హెరిటేజ్‌ ఫ్రీడం సంస్థ 180 దేశాలతో కూడిన ఎకనమిక్‌ ఫ్రీడం వార్షిక సూచీని ఇటీవల విడుదల చేసింది. నిరుడు ఇదే సూచీలో పాకిస్థాన్‌ కంటే తక్కువగా 52.6 పాయింట్లతో భారత్‌ 143వ స్థానంలో నిలిచింది.
  • 57.4 పాయింట్లతో చైనా 111 ర్యాంకును సాధించింది.
  •  1.9 పాయింట్లను పెంచుకుని భారత్‌ తాజాగా 130వ స్థానం దక్కించుకుంది.
  • ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌ నిలవగా, చైనా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఈసారి 110 ర్యాంకు సాధించినట్లు హెరిటేజ్‌ ఫ్రీడం తెలిపింది.
  • ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలోని 43 దేశాల్లో భారత్‌ 30వ స్థానంలో నిలిచిందని ఆ సంస్థ వెల్లడించింది.
  • న్యాయ సమర్థత, వర్తక స్వేచ్ఛ, ప్రభుత్వ నిజాయితీ, ఆర్థిక క్రమశిక్షణ తదితర చర్యల ద్వారా భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నట్లు విశ్లేషించింది.
  • ఆంక్షల రహిత మార్కెట్‌ విధానం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో భారత్‌లో లేదని పేర్కొంది.
  • అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, ఆంక్షలు, ఆర్థిక-బడ్జెట్‌ నిర్వహణ సరిలేకపోవడం వంటి కారణాలు సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు నివేదిక విశ్లేషించింది.
  • విదేశీ పెట్టుబడులను స్వాగతించే విషయంలో భారత ప్రభుత్వ పారదర్శకత సగటు కంటే తక్కువగా ఉందని ఆక్షేపించింది.
  • భారతీయ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వ సంస్థలే నియంత్రిస్తున్నాయనీ, విదేశీ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని పేర్కొంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని మొత్తం ఆస్తుల్లో 10% చిక్కుల్లో ఉన్నట్లు పేర్కొంది.

views: 936



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams