Current Affairs Telugu Daily

మిసెస్‌ ఇండియా యూకే తుది పోటీలకు దొడ్డా సౌమ్య
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దొడ్డా సౌమ్య బ్రిటన్‌లో జరుగుతున్న మిసెస్‌ ఇండియా యూకే-2018 పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. కలర్స్‌ టీవీ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌ చేరిన 16 మంది మహిళల్లో సౌమ్య ఒకరు.
  • రాజమహేంద్రవరంలోనే పుట్టి పెరిగిన సౌమ్యకు ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక డాక్టర్‌ అమర్‌నాథ్‌తో వివాహం జరిగింది. 12 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడిన ఆమె అక్కడే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు  విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్న సౌమ్య అక్కడ నిర్వహిస్తున్న మిసెస్‌ ఇండియా యూకే పోటీల్లో పాల్గొని ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

views: 962

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams