Current Affairs Telugu Daily

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3% : ADB
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.3 శాతం ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి చేరుతుందని ఏషియన్‌ డెవప్‌మెంట్‌ బ్యాంక్‌(ADB) అంచనా వేసింది. ఆసియా దేశాల్లోనే అధిక వృద్ధిరేటు భారత్‌దే అవుతుందని పేర్కొంది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలు తక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన భారత్‌, ఈ ఆర్థికం నుంచి పునరుత్తేజితం అవ్వనుందని తెలిపింది. వస్తు సేవల పన్నుతో పాటు బ్యాంకింగ్‌ సంస్కరణ వల్లే ఇంతటి వృద్ధి లభించనుందని వివరించింది.
  • ఆసియా దేశాల వృద్ధి అంచనాలకు సంబంధించి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ 2018 పేరిట నివేదికను మనీలా కేంద్రంగా పనిచేసే ADB విడుదలు చేసింది.
  • గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.6 శాతంగా నమోదైంది. 2016 చివరిలో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయ ప్రభావంతో పాటు, 2017 జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ వల్ల వృద్ధిరేటు తగ్గింది. వ్యవసాయంలో వృద్ధి మందగించడమూ ఒక కారణమే. 2016-17లో వృద్ధిరేటు 7.1 శాతం
  • ADB ఏర్పాటు - 1966 డిసెంబర్‌ 19
  • ADB ప్రధాన కార్యాలయం - మనీలా, ఫిలిప్పీన్స్‌
  • ADB సభ్య దేశాలు - 67
  • ADB అధ్యక్షుడు - తకిహికో నకావో
ADB-Asian Development Bank

views: 943



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams