Current Affairs Telugu Daily

అల్జీరియాలో విమానం కూలి 257 మంది మృతి
అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు సమీపంలో 2018 ఏప్రిల్‌ 11న సైనిక విమానం కూలిన ఘటనలో 257 మంది మృతి చెందారు. బౌఫారిక్‌ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్‌ అయిన వెంటనే విమానం ప్రమాదానికి గురైంది. విమానాశ్రయం చుట్టూ ఉన్న నిర్మానుష్యమైన పంట పొలాల్లో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువ మంది సైనికులు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు తెలిపారు. దక్షిణ అల్జీరియాలోని టిండౌఫ్‌కు వారిని తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. అల్జీరియాలో గతంలోనూ ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2014 ఫిబ్రవరిలో సైనిక విమానం కూలిన ఘటనలో 77 మంది చనిపోగా, అదే ఏడాది జులైలో ఓ పౌర విమానం ప్రమాదానికి గురవ్వడంతో 116 మంది మృతి చెందారు.
  • అల్జీరియా రాజధాని - అల్జీర్స్‌
  • అల్జీరియా అధ్యక్షుడు - అబ్దెలాజిజ్‌ బౌతెఫ్లికా
  • అల్జీరియా ప్రధానమంత్రి - అహ్మద్‌ ఔయాహియా

views: 768

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams