Current Affairs Telugu Daily

గుణదలలో శాతవాహన కాలం నాటి బౌద్ధ గుహ
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల గుణదలలో క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గుహ బయటపడిందని అమరావతి సాంస్కృతిక కేంద్రం, విజయవాడ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. దాన్ని 20 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు గల వసార, 15 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుగల మండపం, 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్న దేరవాద బౌద్ధ భిక్షువు గుహావాసం అని నిర్ధారించారు. క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహన కాలం నాటిదని వెల్లడించారు.
  • ఒక బౌద్ధాచార్యుడు, 10 మంది బౌద్ధ భిక్షువు వర్షాకాలంలో ఉండడానికి ఉద్దేశించిందన్నారు. ఈ గుహను వేంగీ చాళుక్యల కాలంలో వైదిక బ్రహ్మణమత గుహగా మార్చిన ఆనవాళ్లు దొరికాయన్నారు.
  • బౌద్ధాచార్యుని గదిలో మెట్లు, దేవతా పీఠం ఏర్పాటు, గుహలోని స్తంభాలను ఎనిమిది పలకలుగా తీర్చిదిద్దడం ఇందుకు ఆధారాలుగా చెప్పవచ్చన్నారు.
  • ప్రస్తుతం ఈ బౌద్ధ గుహాలయంలో కనకదుర్గమ్మ ప్రతిమను పెట్టి అరాధిస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ గుహను చీకటి, గబ్బిలాల, సొరంగ, కనకదుర్గ గుహగా పిలుస్తున్నారు.

views: 866Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams