Current Affairs Telugu Daily

జీశాట్‌-6ఏ జాడ గుర్తింపు
ఉపగ్రహంలోని కేబుల్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇటీవల భూమితో సిగ్నల్‌ అనుసంధానం కోల్పోయిన జీశాట్‌-6ఏ ఉపగ్రహం జాడను గుర్తించినట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ 2018 ఏప్రిల్‌ 10న వెల్లడించారు.
  • భూమికి 26,000 కి.మీ. పెరీజీ(భూమి నుంచి అత్యంత తక్కువ దూరం ఉండే), 33,000 కి.మీ. అపోజీ (అత్యంత ఎక్కువ దూరం ఉండే) కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ సమాచార ఉపగ్రహం కదలికలను ఇస్రో బృందం నిరంతరం గమనిస్తోందని చెప్పారు.
  • ఉపగ్రహం తన కక్ష్యలో తిరుగుతున్నపుడు గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి వచ్చే సిగ్నల్స్‌ ఒక నిర్దిష్టమైన స్థానంలో అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

views: 1031

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams