Current Affairs Telugu Daily

8 పంచాయతీరాజ్‌ సంస్థలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికిరణ్‌ జాతీయ అవార్డులు
దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికిరణ్‌ జాతీయ పురస్కారాల్లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట మండలం  మరోసారి సత్తాచాటింది. మండలాల కోటాలో సిద్దిపేటకు, గ్రామాల కోటాలో ఇర్కోడ్‌కు అవార్డులు దక్కాయి. సిద్దిపేట మండలం, ఇర్కోడ్‌ గ్రామం సహా రాష్ట్రంలోని 8 పంచాయతీరాజ్‌ సంస్థలకు అవార్డులు దక్కాయి.
  • జిల్లా కోటాలో ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌.. మండలాల కోటాలో సిద్దిపేట, శ్రీరాంపూర్‌, గ్రామపంచాయతీ కోటాలో ముష్టిపల్లి (సిరిసిల్ల జిల్లా), ఇర్కోడు (సిద్దిపేట జిల్లా), కాల్వ శ్రీరాంపూర్‌ (పెద్దపల్లి జిల్లా), గంటల్‌పల్లి (రంగారెడ్డి జిల్లా), వెలిచాల (కరీంనగర్‌ జిల్లా)కు పురస్కారాలు దక్కాయి.
  • కరీంనగర్‌ జిల్లాలోని దుద్దెనపల్లికి నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామ సభ పురస్కారం లభించింది.
  • అవార్డు కింద జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు.. మండలాలకు రూ.25 లక్షల చొప్పున.. గ్రామ పంచాయతీకురూ.8-12 లక్షల చొప్పున నిధులు అందజేస్తారు.
  • ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దివస్‌ సందర్భంగా ప్రధాని ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 

views: 1026Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams