Current Affairs Telugu Daily

ఘాటైన మిర్చీతో తలనొప్పి, హృద్రోగ సమస్యలు
ఘాటైన మిర్చీని తింటే తాళలేనంతగా తలనొప్పి, హృద్రోగ సమస్యలు వచ్చే ముప్పుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 2017లో పారిస్‌లో జరిగిన మిర్చీ పోటీలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన ‘కరోలినా రీపర్‌’ మిరపకాయను తిని చాలా రోజు తీవ్రమైన మెడనొప్పి, తలనొప్పితో బాధపడ్డాడు. ఘాటైన మిర్చీ, మిరియాల కారంతో హృద్రోగ ముప్పు ఉందని, కారం తిన్న తర్వాత వాంతులు, నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఈ కేసును అధ్యయనం చేసిన హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు గుణశేఖరన్‌ సూచించారు.
views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams