Current Affairs Telugu Daily

కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 10న పు కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు, ఆర్టీసీ, కాపు కార్పొరేషన్‌, శాప్‌, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ వంటి సంస్థల ఛైర్మన్‌ పదవులను భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు, 4 రీజియన్లకు ఛైర్మన్లను ఎంపిక చేశారు. మొత్తం 17 మందికి ఛైర్మన్‌ పదవులు లభించాయి. కార్పొరేషన్ల సభ్యుల్ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.
  • టీటీడీ ఛైర్మన్‌ పదవికి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ఎంపిక చేశారు.
  • వర్ల రామయ్యను ఆర్టీసీ ఛైర్మన్‌ పదవికి ఎంపిక చేశారు.
  • మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డిని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పటివరకు కేఈ ప్రభాకర్‌ ఆ పదవిలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో రాజీనామా చేశారు.
  • కాపు కార్పొరేషన్‌కు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని చైర్మన్‌గా ఎంపిక చేశారు.
  • ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావుకు మళ్లీ అవకాశమిచ్చారు.
  • దాసరి రాజా మాస్టారును రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.
  • రాష్ట్ర మైనారిటీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్‌కు అవకాశం దక్కింది.
  • ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ముఖ్య అనుచరుడు మహ్మద్‌ హిదాయత్‌కు మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మరోసారి అవకాశమిచ్చారు.
             ఛైర్మన్‌ పేరు                                                              కార్పొరేషన్‌
1. పుట్టా సుధాకర్‌యాదవ్‌                               తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు
2. వర్ల రామయ్య                                             ఏపీఎస్‌ఆర్టీసీ
3. తెంటు లక్ష్మినాయుడు                               ఆర్టీసీ, విజయనగరం రీజియన్‌
4. మెంటె పార్థసారధి                                      ఆర్టీసీ, విజయవాడ రీజియన్‌
5. ఆర్‌.వి.సుభాష్‌ చంద్రబోస్‌                         ఆర్టీసీ, న్లెూరు రీజియన్‌
6. చల్లా రామకృష్ణారెడ్డి                                    ఆర్టీసీ, కడప రీజియన్‌
7. దాసరి రాజారావు(రాజా మాస్టార్‌)                 గ్రంథాలయ పరిషత్‌ 
8. పి.అంకమ్మచౌదరి                                       శాప్‌
9. నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి                              నీటిపారుదల అభివృద్ధి సంస్థ
10. డా॥ దివి శివరాం                                       అటవీ అభివృద్ధి సంస్థ
11. ఎస్‌.ఎం.జియావుద్దీన్‌                                మైనారిటీ కమిషన్‌
12. ఎం.డి.హిదాయత్‌                                     మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
13. వై.నాగేశ్వరరావు యాదవ్‌                         గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య
14. రఘుపతుల రామ్మోహన్‌రావు                  ఏపీ కనీస వేతనాల బోర్డు
15. నామన రాంబాబు                                     ఏపీ గృహ నిర్మాణ సంస్థ
16. జూపూడి ప్రభాకరరావు                             ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక కార్పొరేషన్‌
17. కొత్తపల్లి సుబ్బారాయుడు                        ఏపీ కాపు సంక్షేమాభివృద్ధి సంస్థ

views: 823Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams